తెలంగాణ రాష్ట్ర సేన'(TRS) ఆవిర్భావం..

తెలంగాణ రాష్ట్ర సేన'(TRS) ఆవిర్భావం..
- బీఆర్ఎస్‌పై నిప్పులు..
- తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి…
- కల్వకుంట్ల కవిత…
మేడ్చల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ పట్టణ వేదికగా శనివారం రోజు జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆమె ఘాటు విమర్శలు చేశారు.
ఫామ్‌హౌస్‌లో పెద్ద సార్ ఉండాలి.. సీఎం కావాలని చిన్న సార్…
బీఆర్ఎస్ తన అసలు సిద్ధాంతాన్ని కోల్పోయిందని ఇప్పుడు ఇదే బిఆర్ఎస్ సిద్ధాంతంగా మారిందని కవిత ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రజల కోసం ప్రారంభమైందని, కానీ ప్రస్తుతం అది కేవలం ఒకే కుటుంబ పాలనకు పరిమితమైందని ఒకప్పటి కెసిఆర్ కాదని, కెసిఆర్ మనమనిషి కాదు కనికరం లేని మరమనిషి. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్న నాయకుడు అని ఆమె విమర్శించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే,, ప్రజల సమస్యలపై స్పందించాల్సిన నాయకత్వం ప్రజలకు దూరమైందని, తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని మండిపడ్డారు.
ముఖ్యమైన హామీలు
సభలో ప్రసంగించిన కవిత, ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెడుతుందని ప్రకటించారు:
ఉచిత విద్య, వైద్యం
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడం. ప్రతి ఊరిలో ఒక బడి ఒక టీచర్ ఉండాలి కేజీ నుండి పీజీ వరకు, డాక్టర్లు కావాలన్నా, లాయర్లు కావాలన్నా ఇది కేవలం అమ్మ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది అని స్పష్టం చేసింది
వ్యవసాయం, ఉపాధి
రైతులకు అండగా ఉండటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. వ్యాపారానికి సంబంధించిన అన్ని సదుపాయాలు సమకూరుస్తాము అమ్మ ప్రభుత్వ ఉద్దేశం మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము.
సామాజిక న్యాయం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడం. మైనార్టీ కార్పొరేషన్, బీసీలకు 50% రిజర్వేషన్, కల్పిస్తామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అమరవీరుడి కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా భద్రత ఆడబిడ్డల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, తాను ప్రజలకు ఒక ‘అమ్మలా’ అండగా నిలుస్తానని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
మూడు ప్రధాన పార్టీలపై విమర్శలు
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన పార్టీలు అవినీతి, కుటుంబ పాలన, అధర్మంతో నిండిపోయాయని కవిత విమర్శించారు. నేను మీ అమ్మను.. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి. దళితబంధు వంటి పథకాలు కేవలం ఒక్క ఉప ఎన్నిక కోసమే అమలు చేశారని ఆమె ఆరోపించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నేరుగా పోరాడటమే తన లక్ష్యమని, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని ఆమె స్పష్టం చేశారు.
