2009 in Movie | వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నైరా తన మా

2009 in Movie | వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నైరా తన మా
2009 in Movie | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నైరా బెనర్జీ తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పింక్ మరియు పాస్టల్ కలర్ స్ట్రిప్స్ ఉన్న స్ట్రాప్‌లెస్ టాప్, దానికి జోడీగా బేజ్ కలర్ స్కర్ట్ ధరించి అచ్చం పొద్దుతిరుగుడు పువ్వులా వికసించింది. తన ఒత్తైన జుట్టును చిలిపిగా సరిచేసుకుంటూ, అదిరిపోయే చిరునవ్వుతో ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారును కట్టిపడేస్తున్నాయి. “నా నవ్వుతో మీ చీకటి రోజుల్లో వెలుగులు నింపుతున్నాను.. మీ ముఖంలో కూడా నవ్వు వచ్చిందా?” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఈ ఫోటోలకు మరింత అందాన్ని తెచ్చింది.
సినీ ప్రస్థానం – మన తెలుగుతోనే మొదలు:
నైరా బెనర్జీ అసలు పేరు మధురిమ బెనర్జీ. ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ, 2009లో వచ్చిన ‘ఆ ఒక్కడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘టెంపర్’, ‘కోతజంట’ వంటి చిత్రాల్లో మెరిసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంది. బాలీవుడ్‌లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘కమాల్ ధమాల్ మలామాల్’తో పాటు ‘వన్ నైట్ స్టాండ్’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.



