jyothi rai| లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి రాయ్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. బుల్లితెర ఆడియన్స్‌ని తన నటనతో ఫిదా చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన అందంతో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం సీరియల్స్‌కి బైబై చెప్పి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది జ్యోతి. ఆమె లీడ్ రోల్‌లో కిల్లర్ సినిమాలో నటించింది.
గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరో రిషి తల్లి జగతిగా తెలుగు ఆడియన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది జ్యోతి రాయ్. తన వయసుకి మించిన పాత్ర అయినప్పటికీ దాంట్లో యాక్ట్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది జ్యోతి. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో లీడ్ రోల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా పూలగౌనులో ఫొటోషూట్ చేసింది జ్యోతి. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.































