గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్
గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్
- పాఠశాల చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే..సందర్భంగా గౌన్లు ధరించిన విద్యార్థులకు అభినందిస్తున్న కరస్పాండెంట్ నితిన్,
- పట్టుదలతో చదివితే లక్ష మీ చేతులు ప్రిన్సిపల్ అపర్ణ,
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో శ్రీ విశ్వభారతి విద్యాలయం పాఠశాలలో కరస్పాండెంట్ నితిన్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నితిన్ రాజ్ మాట్లాడుతూ, చిన్న తరగతులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను, నృత్యాలను ప్రశంసించారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి విద్యార్థులకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, టీచర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు…
