బడి ఒక దేవాలయం, విద్య ఒక వరం.

బడి ఒక దేవాలయం, విద్య ఒక వరం.
బడి పిలుస్తోంది, రండి నేర్చుకుందాం.”
బడి – చదువు, సంస్కారం నేర్పే చిరునామా.”
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరులో “బడి పిలుస్తోంది” ఎన్రోల్మెంట్ ర్యాలీ నందికొట్కూరు మున్సిపాలిటీలో బైరెడ్డి రాజా శేఖర్ రెడ్డి నగర్లో విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “బడి పిలుస్తోంది” విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

బైరెడ్డి నగర్ కాలనీ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు రంగురంగుల జెండాలు, విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలపై బ్యానర్లు చేతబట్టి నినాదాలు చేశారు. అనంతరం కాలనీ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి విద్య ఆవశ్యకతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రథమ సహాయకురాలు సాలమ్మ, ఉపాధ్యాయినులు విజయకుమారి, లలితమ్మ, లలితకుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత, ఉపాధ్యాయులు వెంకటరమణ, ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, నాగేశేషులు, కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 17 నుంచి 23 వరకు ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది.
