Police |జంట హత్యల కలకలం

Police | జంట హత్యల కలకలం
Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నూరుఖాన్ బజార్ లో అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్, అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ, పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
