పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు

చల్లపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం చల్లపల్లిలోని శ్రీ అభయ ఆంజనేయ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు పైడిపాముల కృష్ణకుమారి, కొల్లూరి కోటేశ్వరరావు, ఎంపీటీసీ పైడిపాముల స్వప్న పాల్గొన్నారు. అలాగే టీడీపీ, జనసేన నాయకులు షేక్ నబీఘోరీ, కోట సత్యం, ఇబ్రహీం, అనుమకొండ పూర్ణచంద్రరావు, పరిశే మౌళి, బుల్లా కిషోర్, మేడికొండ రవి, గంగిశెట్టి బాబూ రాజేంద్ర, గోపాలకృష్ణ, బావిశెట్టి కనకదుర్గ తదితరులు హాజరయ్యారు.
