అకుంఠిత దీక్షతో పతాక స్థాయికి..

అకుంఠిత దీక్షతో పతాక స్థాయికి..
- ఏపీ జెన్ కో డైరెక్టర్ థర్మల్ అశోక్ కుమార్ రెడ్డి
- ఎన్టీటీపీఎస్ 8వ యూనిట్ 100 రోజులు నిర్విరామంగా విద్యుదుత్పాదన
- కేక్ కట్ చేసి ఉద్యోగులు, అధికారులకు శుభాకాంక్షలు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : అకుంఠిత దీక్ష, పట్టుదల, కృషితో పనిచేసి సంస్థను పతాక స్థాయికి తీసుకెళ్లాలని ఏపీ జెన్ కో డైరెక్టర్ థర్మల్ పి.అశోక్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీటీపీఎస్ స్టేజ్ – 5 (800 మెగావాట్లు) 8వ యూనిట్ 100 రోజులు నిర్విరామంగా విద్యుదుత్పత్తి చేసిన సందర్భంగా గురువారం కేక్ కట్ చేసి ఉద్యోగులు, అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో స్టేజ్ – 5 (800 మెగావాట్లు) కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) చేసినట్లు చెప్పారు.

వంద రోజులు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుదుత్పత్తితో కృషి చేసిన జూనియర్, సీనియర్ ఇంజనీర్లకు, నిర్వహణ మరమ్మతుల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్టేజ్ – 5 పర్యవేక్షక ఇంజనీర్లు ఓ అండ్ ఎం, కాంట్రాక్టు కార్మికుల నేతృత్వంలో ఈ రికార్డు సాధించడం ఎంతో సంతోషదాయకమన్నారు. స్టేజ్ – 5 ఎరెక్షన్ సమయంలో ఉన్న అధికారులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ పి.శివ రామాంజనేయులు, పర్యవేక్షక ఇంజనీర్లు మారుతి ప్రసాద్, రవి కిరణ్, రమణయ్య, ప్రసాద్, అనురాధ, శివ ప్రసాద్, వెంకట్రావు, వాసుదేవరావు, డిప్యూటీ సెక్రటరీ శ్రీదేవి, జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) కృష్ణమోహన్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక రక్షణ దళ అసిస్టెంట్ కమెండెంట్ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
