చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పెనమలూరు, ఆంధ్రప్రభ ; ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మ దినోత్సవ వేడుకలు పోరంకి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆకాంక్షించారు.

రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో దానిని తలదన్నే విధంగా అమరావతి నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply