High Court | ఎక్స్‌, మెటా, గూగుల్‌కు నోటీసులు…

High Court | ఎక్స్‌, మెటా, గూగుల్‌కు నోటీసులు…

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోల వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ కీలక సూచనలు చేసింది.

కృత్రిమ మేధస్సు (ఏఐ)ను దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలపై గుజరాత్ హైకోర్టు కఠినంగా స్పందించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారించిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో మెటా ఇండియా, గూగుల్, ఎక్స్‌, రెడిట్‌, స్క్రిబ్డ్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టేందుకు, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, వ్యక్తిగత గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

Leave a Reply