డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి హాజరు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఈరోజు (బుధ‌వారం) సాయంత్రం బెంగళూరులో డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పు నేపథ్యంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంతో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.

Leave a Reply