Rajamouli | దేవర సెట్ లో వారణాసి షూట్ చేస్తున్నారా…?

Rajamouli | దేవర సెట్ లో వారణాసి షూట్ చేస్తున్నారా…?

Rajamouli | రాజమౌళి స్టైల్ అంటే కాంప్రమైజ్ ఉండదు
దేవర సెట్‌లో వారణాసి సీన్స్ షూటింగ్..?
విదేశీ షెడ్యూల్‌పై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
మహేష్ బాబు – రాజమౌళి సినిమా ప్లానింగ్‌లో మార్పులు
హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ
పరిస్థితులు సర్దుకుంటే విదేశాలకు మళ్లీ ప్లాన్
ఫైనల్ అవుట్‌పుట్ కోసం రాజమౌళి నిర్ణయం ఏంటి..?

Rajamouli | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దర్శకధీరుడు రాజమౌళి.. తను అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరుకు కాంప్రమైజ్ కారు. ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. అందుకనే.. ఆయన్ని పని రాక్షసుడు అంటుంటారు. తను కావాలనుకున్నట్టు రావడం కోసం.. ఒక్క సీన్ ని ఎన్ని సార్లు అయినా తీస్తారు.. ఒక్క సీన్ కోసం ఎంత దూరం అయిన.. అనుకున్న ప్లేస్ కి వెళ్లి షూట్ చేస్తుంటారు. అయితే.. వారణాసి విషయంలో మాత్రం జక్కన్న కాంప్రమైజ్ అవుతున్నారని.. టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

దేవర సెట్ లో.. వారణాసి..?

వారణాసి మూవీని విదేశాల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీని ఎక్కడెక్కడ షూట్ చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నారు. విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీని షూట్ చేసిన సెట్ లో వారణాసి షూటింగ్ చేస్తున్నారనే వార్త లీకైంది. అక్కడ నుంచి జక్కన్న కాంప్రమైజ్ అయ్యారని.. అందుకనే దేవర సెట్ లో షూటింగ్ చేస్తున్నారని.. వార్తలు రావడం.. అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

Rajamouli

వారణాసి పై వార్ ఎఫెక్ట్..

ఇంతకీ విషయం ఏంటంటే… ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు దారి తీస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా పై కూడా పడింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరగాల్సి ఉంది. సినిమా టీమ్ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుందట.

Rajamouli

పరిస్థితులు అనుకూలిస్తే..

అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా విదేశాలకు వెళ్లడం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా దుబాయ్, అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో విమాన సర్వీసులు భారీగా తగ్గించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి వంటి ప్రముఖులు విదేశాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉండటంతో ఈ షెడ్యూల్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం టీమ్ హైదరాబాద్‌లోని దేవర సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రపంచ పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి విదేశాలకు వెళ్లే ఆలోచనలో టీమ్ ఉందట. ఈలోపు కొన్ని సీన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. రాజమౌళి కాంప్రమైజ్ కారు.. ఒకవేళ ఇక్కడ షూట్ చేసినా.. అవుట్ ఫుట్ సరిగా రాకపోతే.. ఆతర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ షూట్ చేసే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. చూడాలి మరి.. ఏం జరగనుందో..?

Rajamouli

Leave a Reply