మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్

మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని హైదరాబాద్ లోని మంత్రి క్వాటర్స్ లో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దూoపూర్ సర్పంచ్ తిరుమలేష్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. మొగ్ధంపూర్ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేపట్టాలని తమ గ్రామం పెద్ద జట్రం రెవెన్యూ రికార్డులో ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పాలనా సౌలభ్యం కోసం తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై వినతి పత్రంలో పేర్కొన్నారు. రెవెన్యూ గ్రామంగా తమ గ్రామాన్ని మారిస్తే రైతులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అందుకు మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాము తదితరులు పాల్గొన్నారు.
