AP| క‌న్న‌బిడ్డ‌పై ప్రియుడితో దాడి…

AP| వి.కోట, జులై 17, ఆంధ్రప్రభ : మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌కవ‌ర్గంలోని వి.కోట మండ‌లంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఓ తల్లి తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల సమాచారం మేరకు…ఈశ్వర్ నగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంద్రజ భర్త మరణించగా, అనంతరం ఎర్రంపల్లికి చెందిన రాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. తమ సంబంధానికి కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఇంద్రజ, తన ప్రియుడు రాజుతో కలిసి బాలుడిపై దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.

బాలుడి శరీరంపై, మర్మాంగం వద్ద బ్లేడుతో గాయపరిచి, అనంతరం విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేయగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.