ఘనంగా అమృత్ జయంతి వేడుకలు..
- 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత్ గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మక్తల్ పట్టణంలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమృత్ గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరము విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి 30 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఎదుగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు పేర్కొన్నారు.
ప్రతిఏటా అమృత్ గౌడ్ జయంతి సందర్భంగా అమృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కలిపించడం జరుగుతుందని పేర్కొన్నారు .ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు బీసీ కాలనీ పాఠశాలలో ప్రభుత్వం పక్కా భవనంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమృత్ గౌడ్ తల్లిదండ్రులు పి. ధనలక్ష్మి,పి. నరసింహ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, అనుగొండ మాజీ సర్పంచి కొత్త కాపు గోవర్ధన్ రెడ్డి, మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న హన్మంతు, నాయకులు కే. తాయప్ప, జుట్ల శంకరు, బండారి ఆనంద్, కె. ఆంజనేయులు, జే .నరసింహ, మామిళ్ల అమ్రేష్ ,ఉప్పరి రఘు, సతీష్ గౌడ్ ,మహేష్ కుమార్ గౌడ్, రాములు, అశోక్ కుమార్ రెడ్డి, మాధ్వార్ రామకృష్ణ, వేణుగోపాల్ గౌడ్, తాళంపల్లి సమీర్, ఆకాష్, దామోదర్ ,మలేపల్లి శ్రీనివాసులు, కొత్తపల్లి కృష్ణయ్య, మంథన్ గోడ్ రవీందర్ గౌడ్, శివన్న గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగర్జున్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
