గమ్యం కంటే ప్రాణమే ముఖ్యం

గమ్యం కంటే ప్రాణమే ముఖ్యం

ములకలపల్లి, ఆంధ్రప్రభ: గమ్యం చేరుకోవడంకంటే జీవితం ముఖ్యమని, త్వరగా చేరాలన్న ఆతృతలో ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అవగాహనతోనే ప్రమాదాలు నిలువరించగలం అని జగన్నాథపురం సర్పంచ్ కుంజా వినోద్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా, స్థానిక ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం మంగళవారం జగన్నాథపురం ప్రధాన కూడలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజా వినోద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో మరింత చైతన్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మధుప్రసాద్ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం ఉపసర్పంచ్ జలగం మాధవి వార్డు సభ్యులు పిడియాల వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు సోయం బోడప్ప పిడియాల బుజ్జి కౌలూరి ప్రసాద్ రామాచారి మీడియం నారాయణ కూరం రామకృష్ణ గుంటూరు సాయి ఆటో యూనియన్ నాయకులు షేక్ జమీర్ జానీ కొవ్వాకుల రమణ పలగాని శ్రీను కనకం సంతోష్ వ్యాపారస్తులు వాసా రాంబాబు కనకం రవి అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు వాహన దారులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply