ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు నాయకులు

కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాలతో పాటు కల్లూరు, ఓలా అందకుర్, పెంచికల్ పాడు, లింబ కె విట్టాపూర్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని జెండాలను ఎగురవేశారు. అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రమైన కుంటాల అధికారులులోని కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని తెలియజేశారు. అదేవిధంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని, రాజ్యాంగం కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అధికారులు సైతం తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనలు వివరించారు. అధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలో సైతం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన భారత రాజ్యాంగం కోసం ఎంతో త్యాగం చేశారని అధికారులు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో త‌హ‌సిల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎస్సై సి అశోక్, స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్, నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, జీవి రమణారావు, నాలం శ్రీనివాస్, దత్తు, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ తో పాటు ఆయా గ్రామాల్లోని సర్పంచులు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply