summer skincare tips | జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్..

summer skincare tips | జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్..
summer skincare tips | సరైన క్రీం ఎంపిక ఎలా ఉండాలి?
క్రీం అప్లై చేసే సరైన విధానం
తక్కువ మేకప్ – ఎక్కువ రక్షణ మంత్రం
summer skincare tips | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వేసవి రానే వచ్చేసింది. భానుడి భగభగలకు తోడు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ వేసవిలో ఆడవారు బయటికి వెళ్లాలంటే పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక మోహనికి జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు. అయితే ఎంత ఖరీదైన క్రీమ్స్ రాసినా ఎండలోకి వెళ్లగానే అవి చెమట రూపంలో కారిపోతూ.. మొహమంతా జిడ్డుగా మారిపోతోంది. ఇంతకీ అసలు పొరపాటెక్కడ జరుగుతోంది? ఈ జిడ్డును వదిలించుకుని, తాజాగా కనిపించాలంటే ఏ క్రీం వాడాలి? ఎలా అప్లై చేయాలి? అనే విషయాలపై మా స్పెషల్ రిపోర్ట్..
summer skincare tips | పొరపాటెక్కడ జరుగుతోంది?

చాలామంది శీతాకాలంలో వాడే మాయిశ్చరైజర్లు లేదా హెవీ క్రీమ్స్ ఎండాకాలంలో కూడా వాడుతుంటారు. ఎండాకాలంలో చర్మం సహజంగానే ఎక్కువ నూనెలను (Sebum) విడుదల చేస్తుంది. దీనికి తోడు మనం రాసే మందపాటి క్రీమ్స్ తోడైతే.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి చెమట బయటికి రాక, రాసిన క్రీమంతా జిడ్డుగా కారిపోతుంది.
summer skincare tips | ఎండాకాలంలో ఏ క్రీం వాడితే మంచిది?

వేసవిలో మీ చర్మానికి కావాల్సింది ‘హెవీ క్రీం’ కాదు, ‘లైట్ వెయిట్ హైడ్రేషన్‘. ఇది నిపుణుల సలహా ప్రకారం మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఖచ్చితంగా ఆయిల్-ఫ్రీ జెల్ మాయిశ్చరైజర్లు వాడాలి. ఇవి చర్మంలోకి త్వరగా ఇంకిపోయి, జిడ్డుగా కనిపించవు. ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. అయితే, అది ‘మ్యాట్ ఫినిష్‘ అయ్యి ఉండాలి. ఇది ముఖంపై నూనెను కంట్రోల్ చేస్తుంది. ‘సిలికా‘ లేదా ‘నియాసినామైడ్‘ ఉన్న సన్‌స్క్రీన్లు చర్మాన్ని పొడిగా ఉంచడానికి సహాయపడతాయి.
అయితే మీరు వాడే క్రీం ప్యాకెట్ పైన ఈ పదం ఉందో లేదో చూసుకోండి. అంటే ఇది చర్మ రంధ్రాలను మూసివేయదని అర్థం.
summer skincare tips | అప్లై చేసే పద్ధతి.. ఇదే అసలైన కిటుకు!

చాలామంది క్రీం రాసిన వెంటనే ఎండలోకి వెళ్తారు. ఇది పెద్ద తప్పు. ముందుగా మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎండాకాలంలో మాయిశ్చరైజర్, ఫౌండేషన్, సన్‌స్క్రీన్.. ఇలా ఒకదాని మీద ఒకటి రాసేయకండి. వీలైతే ‘మాయిశ్చరైజర్ ఉన్న సన్‌స్క్రీన్‘ లాంటి 2-ఇన్-1 ప్రొడక్ట్స్ వాడండి. తక్కువ లేయర్లు ఉంటే చెమట తక్కువగా పడుతుంది. సన్‌స్క్రీన్ రాసిన కనీసం 15 నుండి 20 నిమిషాల తర్వాతే ఎండలోకి వెళ్లాలి. అప్పుడే అది చర్మానికి ఒక రక్షణ పొరలా సెట్ అవుతుంది.
summer skincare tips | మీ బ్యాగులో ఇవి ఉన్నాయా?

మొహంపై జిడ్డు అనిపించినప్పుడు క్రీం మీద క్రీం రాసేయకుండా, బ్లాటింగ్ పేపర్స్ (Blotting Papers) పేపర్లతో మెల్లగా అద్దండి. ఇవి అదనపు నూనెను పీల్చుకుంటాయి. రోజ్ వాటర్ లేదా మంచి ఫేస్ మిస్ట్‌ను స్ప్రే చేసుకోవడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది.
summer skincare tips | తక్కువ మేకప్ – ఎక్కువ రక్షణ

“తక్కువ మేకప్ – ఎక్కువ రక్షణ” అనేది వేసవి మంత్రం కావాలి. చర్మతత్వాన్ని బట్టి జెల్ ఆధారిత ఉత్పత్తులను ఎంచుకుంటే ఆ జిడ్డు సమస్య నుండి తప్పించుకోవచ్చు. గొడుగుతో పాటు సరైన క్రీం కూడా తోడైతేనే మీ అందం ‘కారిపోకుండా‘ ఉంటుంది!
