రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…

జైనూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆశపెళ్లి సర్పంచ్ మరప రవీందర్ అన్నారు. సోమవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని ఆశ పెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి రోడ్డు భద్రత విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాల నడపాలని వాహన పత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన కోరారు. వాహనాల పత్రాలు అన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. యువత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆయన కోరారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత కమిటీ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ జలపత్ రావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply