ఘనంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు..

మంచిర్యాల, ఆంధ్రప్రభ : “ప్రజా పాలన ప్రగతి 99 రోజుల ప్రణాళిక” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కార్పొరేటర్ పెంట రజిత తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయించి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. కోట్ల రూపాయల నిధులతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ, అభివృద్ధిలో మంచిర్యాల కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.

పారిశుద్ధ్యం, విద్యుత్, త్రాగునీటి సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు నిరంతర సేవలు అందించేందుకు ముందుకు సాగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ ముగింపు సభలో మంచిర్యాల ఎస్సై శ్యాంసుందర్, కో-ఆప్షన్ సభ్యురాలు కొండ పద్మచంద్రశేఖర్, వార్డ్ ఆఫీసర్ ప్రియాంక, మున్సిపల్ సిబ్బంది మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోమల రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply