Hero Nani | ప్లానింగ్ మారిందా..?
Hero Nani | ప్లానింగ్ మారిందా..?
Hero Nani | ప్యారడైజ్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాని–సుజిత్ కాంబోపై పెరుగుతున్న అంచనాలు
డేట్స్ సమస్యతో ఆలస్యమవుతున్న ప్రాజెక్ట్
సుజిత్ ప్లానింగ్‌పై అనిశ్చితి
ఈ క్రేజీ కాంబో ఎప్పుడు సెట్స్‌పైకి?
Hero Nani | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. మార్చి 26న రావాల్సిన ప్యారడైజ్ మూవీ ఆగష్టు 21కి వాయిదాపడింది. రీసెంట్ గా ప్యారడైజ్ మళ్లీ వాయిదాపడడం ఖాయం అంటూ ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే.. నాని.. పవర్ స్టార్ డైరెక్టర్ని టెన్షన్ పెడుతున్నాడని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ప్యారడైజ్ మూవీ మళ్లీ వాయిదా పడనుందా..? నాని పవర్ స్టార్ డైరెక్టర్ని టెన్షన్ పెట్టడం ఏంటి..? ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్..? అసలు ఏం జరిగింది..?
Hero Nani | అందులో ఎలాంటి మార్పు లేదు..

నాని, శ్రీకాంత్ ఓదెల.. ఇద్దరి కాంబినేషన్లో దసరా మూవీ రూపొందడం.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబోలో లేటెస్ట్ గా రూపొందుతోన్న ప్యారడైజ్ మూవీ పై మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. నానిని ఎవరూ ఊహించని పాత్రలో శ్రీకాంత్ ఓదెల చూపిస్తుండడంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక పోస్ట్ పోన్ విషయానికి వస్తే.. ఆగష్టు 21న ప్యారడైజ్ మూవీ ఖచ్చితంగా వస్తుందని.. అందులో ఎలాంటి మార్పు లేదని ప్యారడైజ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Hero Nani | సరికొత్త నాని..

ఇక అసలు విషయానికి వస్తే.. నాని టెన్షన్ పెడుతున్న పవర్ స్టార్ డైరెక్టర్ ఎవరంటే.. సుజిత్ అని ప్రచారం జరుగుతుంది. మేటర్ ఏంటంటే.. ఓజీ సినిమాలో పవర్ స్టార్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఆతర్వాత నానితో సుజిత్ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. నాని నేచురల్ పెర్ఫార్మెన్స్, సుజిత్ స్టైలిష్ మేకింగ్ కలిస్తే ఒక కొత్త తరహా సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. నానిని సరికొత్తగా చూపించడానికి అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట సుజిత్.
Hero Nani | అందుకే.. సుజిత్ టెన్షన్..

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నాని ప్రస్తుతం ప్యారడైజ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్, తదుపరి షెడ్యూల్స్ కారణంగా ఆయన డేట్స్ వెంటనే అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సుజిత్ ప్లానింగ్ పై అనిశ్చితి నెలకొంది. నాని పూర్తిగా ఫ్రీ అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుజిత్.. నాని కోసం ఎదురు చూస్తాడా? లేక మధ్యలో మరో హీరోతో కొత్త సినిమా ప్రారంభిస్తాడా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓజీ తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటే.. లేట్ అవుతుండడంతో సుజిత్ టెన్షన్ పడుతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం గురించి నాని మరోసారి అనౌన్స్ మెంట్ ఇస్తాడేమో చూడాలి.

