Atmakur | ఎస్సై సతీష్ సస్పెన్షన్

Atmakur | ఎస్సై సతీష్ సస్పెన్షన్

Atmakur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సతీష్‌ను సస్పెండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్సైపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో అలసత్వం వహించినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో ఎస్సై సతీష్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా, కొన్ని కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు అండగా నిలిచినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.

అలాగే బాధితులతో దురుసుగా ప్రవర్తించినట్లు కూడా ఫిర్యాదులు రావడంతో, మొత్తం అంశాలపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply