యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి

యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి
- విప్ వేముల వీరేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు.
గురువారం చిట్యాల పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ రామ్ ఎలక్ట్రానిక్స్ & ఫర్నీచర్” షాపును ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
