బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఎరుకలి యాదయ్య (61) అనారోగ్యంతో గురువారం మరణించారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వీరి వెంట ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, పున్న శివ, చెరుపల్లి వెంకటేశం, భీమగాని ఆంజనేయులు, మాదగాని ఆంజనేయులు,యిడం గణేష్, పగిళ్ల శంకరయ్య,లడే యాదయ్య,పెద్దగాని నరేందర్, దుబ్బాక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply