రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..?
రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..?
- తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలి…దళారుల దందా ఆపాలి
- ప్రారంభించకపోతే మార్కెట్‌లోనే రేపు వంటవార్పు కార్యక్రమం
- ధర్నా నేపథ్యంలో మార్కెట్ వద్ద భారీగా పోలీస్ బలగాలు
- మక్క జొన్న కొనుగోళ్లలో ఆలస్యం…
- స్టేషన్ ఘన్‌పూర్ మార్కెట్‌లో బీఆర్‌ఎస్ ధర్నా
- ధర్నాలో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రైతుల సమస్యలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?రైతులను భయబ్రాం తులకు గురి చేయాలనుకుంటున్నారా..?అని బిఆర్ఎస్ జిల్లా యువ జన నాయకుడు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి ఘాటుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కె ట్‌లో మక్క జొన్న కొనుగోళ్లు తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగ ళవారం స్థానిక కౌన్సిలర్లు, రైతులతో కలిసి మార్కెట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా రైతులకు న్యాయం చేయా లి…వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి…దళారుల దందా ఆపాలి అం టూ నినాదాలతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-మార్క్‌ఫెడ్ నిర్వాకంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు : బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు రాకేష్ రెడ్డి

మార్క్‌ఫెడ్ నిర్వాకంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు రాకేష్ రెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను మోసం చేయడం సరికాదన్నారు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌కు తెచ్చి రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తూ రైతు లను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం భయంతో రైతులు రూ.1500ల తక్కువ ధరలకు మక్క జొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2400 మద్దతు ధరతోనే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. 13,14 శాతం తేమ నిబంధనల ప్రకారం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భరదన్ వెంటనే విడుదల చేసి రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని కోరా రు. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్‌లోనే రైతులతో కలిసి వంటవార్పు కార్యక్రమం చేపడతాం:
తక్షణమే(సాయంత్రం వరకు)మక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలి. దళారుల దందాను అరికట్టాలి.లేనియెడల బిఆర్ఎస్ పార్టీ తరుపున రేపు (బుధవారం) మార్కెట్‌లోనే రైతులతో కలిసి వంటవార్పు కార్యక్ర మం చేపట్టి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
మార్కెట్ వద్ద ఉద్రిక్తత…పోలీస్ బలగాల మోహరింపు:
ఈ ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా మార్కెట్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.. దీనిపై రాకేష్ రెడ్డి స్పందిస్తూ ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పోలీసులు మోహరించిందని ఆరోపించారు. పోలీసులు రైతు ల కోసమా…దళారుల కోసమా…? అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్య రఘు రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనగాం యాదగిరి, గుగులోత్ దేవేందర్, రంగు హరీష్, బూర్ల విష్ణు, కేసిరెడ్డి విజయ్, లోడెం రవీందర్, గాలి ప్రవీణ్, తదిత రులు పాల్గొన్నారు.
