Appeal | ఘ‌ట్‌కేస‌ర్ ఫ్లైఓవ‌ర్ ప‌నులు ప్రారంభించాలి – డిప్యూటీ సీఎం భ‌ట్టికి మ‌ల్లారెడ్డి విన‌తి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న ఘ‌ట్‌కేస‌ర్ ఫ్లైఓవ‌ర్ వంతెన ప‌నులు ప్రారంభించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి కోరారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చారు. సుమారు 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘ‌ట్‌కేస‌ర్ ఫ్లైఓవ‌ర్ ప‌నులు పెండింగ్ లో ఉన్నాయ‌ని మ‌ల్లారెడ్డి చెప్పారు. వంతెన ప‌నులు ప్రారంభించేందుకు రూ.50 ల‌క్ష‌ల నిధులు మంజూరు చేసిన‌ట్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ప‌నులు వేగ‌వంతమ‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పారు.

Leave a Reply