తాటికొండ కృష్ణమూర్తికి ఘన సన్మానం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లీగల్ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన వరంగల్ కు చెందిన తాటికొండ కృష్ణమూర్తిని కేసముద్రంలో తాజా మాజీ ఎంపీపీ ఓలం చంద్రమోహన్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాటికొండ కృష్ణమూర్తి తన బాల్యమిత్రులు ఓలం చంద్రమోహన్‌ను కలుసుకున్నారు. అనంతరం ఆయనకు చంద్రమోహన్ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.

మాజీ ఎంపీపీ ఓలం చంద్రమోహన్ మాట్లాడుతూ, తన బాల్య మిత్రుడు, అడ్వకేట్ తాటికొండ కృష్ణమూర్తి రాష్ట్ర స్థాయి బాధ్యతలకు ఎంపిక కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన తాటికొండ కృష్ణమూర్తి, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు, వ్యాపారవేత్తలు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.