కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నార్సింగి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మండలంలోని పలు గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీ బాయి, సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ పథకాల ద్వారా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply