చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మమత

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ మండలంలోని చేంగల్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ దుమల మమత రాజు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గం సభ్యులు అలాగే స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దుమల మమత రాజు మాట్లాడుతూ, గ్రామ పాలకవర్గం కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ అన్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాతి మోహన్ గౌడ్, పంచయతీసెక్రటరీ ప్రదీప్, పాలకవర్గం సభ్యులు, పురస్థపు దిలీప్, గోలి గంగారం, మడవెని అశోక్, బాయి పావని,నరేష్, గుండరం రజిత, రవి గుమ్మెర్ల రవళి, సురేష్,గుమ్మేర్ల సాయన్న మంద గంగాధర్, నుతుల ప్రమీల,థక్కురి నికేష్,పురస్తపు గోదావరి, నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply