అనంతగిరి పద్మనాభ స్వామి సేవలో స్పీకర్ ప్రసాద్ కుమార్

అనంతగిరి పద్మనాభ స్వామి సేవలో స్పీకర్ ప్రసాద్ కుమార్

-పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పూజలు

వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా అనంతగిరిలోని శ్రీ పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జై వెంకట్ రెడ్డి, బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply