Municipal Chaiman | పదవి కోసం ఆ.. ఇద్దరు..

Municipal Chaiman | పదవి కోసం ఆ.. ఇద్దరు..

Municipal Chaiman, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అవ్వడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రంగంలోకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సతీమణి డాక్టర్ సబిత ఆనంద్ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య.. దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్ తరఫున గట్టి అభ్యర్థులు లేకపోవడంతో స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్, స్పీకర్ ప్రసాద్ నుండి ఛైర్మన్ పదవికి తమ వారసులను రంగంలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానంది. మున్సిపల్ కౌన్సిలర్ రిజర్వేషన్లు సైతం అనుకున్న విధంగా రాకపోవడంతో ఇరు పార్టీల్లో కొంత సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది.