Anil Ravipudi | హీరోగా మెప్పించేనా..?

Anil Ravipudi | హీరోగా మెప్పించేనా..?

Anil Ravipudi | దర్శకరత్న దాసరి నుంచి విశ్వనాథ్ వరకు దర్శకుల నటన ప్రయాణం
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నటుడే
అనిల్ రావిపూడిలో ఉన్న హీరో మెటీరియల్
దిల్ రాజు ప్రకటనతో ఇండస్ట్రీలో చర్చ

Anil Ravipudi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హీరోలు.. రైటర్స్, డైరెక్టర్స్ అవుతున్నారు. అలాగే కొంత మంది దర్శకులు.. యాక్టర్స్ గా, హీరోగా కూడా మారి సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరోగా మారుతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇదేంటి.. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు కదా.. ఇప్పుడు హీరోగా మారడం ఏంటి..? ఇదేదో గాసిప్ అనుకుంటే.. పొరపాటే. ఇది నిజంగా నిజమే. అయితే.. అనిల్ రావిపూడి హీరోగా సినిమా ఎప్పుడు ఉంటుంది..? ఎవరితో ఉంటుంది..?

Anil Ravipudi

Anil Ravipudi | దర్శకరత్న, కళాతపస్వి..

దర్శకరత్న దాసరి నారాయణరావు 150కు పైగా సినిమాలు తీసి.. అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఓ వైపు దర్శకుడుగా సినిమాలు చేస్తూనే.. మరో వైపు యాక్టింగ్ కూడా చేసి మెప్పించారు. సూరిగాడు, మామగారు, ఓసేయ్ రాములమ్మ తదితర చిత్రాల్లో దాసరి అద్భుతం నటించి మెప్పించారు. కళాతపస్వి విశ్వనాథ్.. ఎంతటి అద్భుతమైన సినిమాలు తీసారో అందరికీ తెలిసిందే. ఆయన కూడా నటుడుగా మారి.. శుభ సంకల్పం, కలిసుందాం రా, సంతోషం.. తదితర చిత్రాల్లో ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు.

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi | మేకప్ వేసుకున్న దర్శకేంద్రుడు..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. మౌనముని. ఆయన ఎక్కువుగా మాట్లాడరు. తెర వెనుకే ఉంటారు. అలాంటిది రాఘవేంద్రరావు కూడా లేటెస్ట్ గా తీసిన పెళ్లి సందడి సినిమా కోసం మేకప్ వేసుకున్నారు. అందులో ముఖ్యపాత్ర పోషించారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఉగాది, అభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు. ఇలా దర్శకులు యాక్టర్స్ గా కూడా రాణించారు. ఇక అసలు విషయానికి వస్తే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చూడడానికి బాగుంటాడు.. హీరోలా ఉంటాడు. డ్యాన్సులు కూడా బాగా చేస్తాడనే పేరుంది. అందుచేత అనిల్ రావిపూడి హీరోగా నటిస్తే బాగుంటుందని గత కొన్ని రోజులు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Anil Ravipudi

Anil Ravipudi | అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు సినిమా..

ఇప్పుడు.. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి గురించి ప్రస్తావన వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రదీప్ రంగనాథ్ ఫస్ట్ డైరెక్టర్ గా సినిమా తీసి ఆతర్వాత హీరోగా రాణిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఎప్పుడు కథ చెప్పినా.. ఆ పాత్రల్లో దూరి ఎలా నటించాలో తను యాక్ట్ చేసి చూపిస్తాడు. తనలో మంచి యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు దర్శకుడుగా వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు. అతన్ని నేనే హీరోగా పరిచయం చేస్తానని అందరి ముందు దిల్ రాజు ప్రకటించడం విశేషం. అయితే.. ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది అనేది క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

Anil Ravipudi

Leave a Reply