Karnataka | ఆపద్ధర్మ సీఎంగా…

Karnataka | ఆపద్ధర్మ సీఎంగా…
Karnataka | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సిద్ధరామయ్య రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అధికారికంగా ఆమోదించారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పునకు మార్గం సుగమమైంది.
పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు గురువారం సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉండటంతో.. లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి అందజేశారు.
అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న గవర్నర్ ఇవాళ ఉదయం రాజీనామాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎంపికై ప్రమాణ స్వీకారం చేసే వరకు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కొత్త నాయకుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
