ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..

ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని గుర్తూరు గ్రామ సర్పంచ్ విస్సంపల్లి కవిత బాలకృష్ణ తెలిపారు.బాలవికాస ఆధ్వర్యంలో మండలంలోని గుర్తూరు గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రంను శనివారం సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ….సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
వేసవి తాపం నుంచి ఉపశమనానికి చల్లటి నీళ్లు అందించేందుకు బాలవికాస చొరవ చూపడం ప్రశంసనీయమన్నారు. గ్రామానికి వచ్చే బాటసారుల దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందన్నారు. మూడు మాసాల పాటు తాము బాటసారులకు చల్లటి మంచినీరు అందించేందుకు బాలవికాసకు తోడ్పాటు నందిస్తామని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలవికాస మేనేజర్ వై.రమ, కో ఆర్డినేటర్ జె.శైలజ, శోభారాణి, గ్రామ కార్యదర్శి ఎండీ అంజన్, ఉప సర్పంచ్ పంజాల మహేష్, నాయకులు కాసర్ల రంగయ్య, వేణు, మధు, అశోక్, కల్పన, రేణుకలు పాల్గొన్నారు.
