Public | మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా….

Public | మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా….

Public | జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిచ్కుందలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుందకు చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు సాయిరాం ముదిరాజ్,గోపి నాందేవ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాటంతో జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో వరుస చేరికలు కొనసాగుతున్నాయని, వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగటమే కాకుండా పేద, బడుగుబలహీన వర్గాలకు మహిళలకు, రైతులకు అండగా ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నారని, బిచ్కుంద మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాధీమాను ఎమ్మెల్యే తోట వ్యక్తంచేశారు.