Station Tower | సీఎంతో మాట్లాడాలని డిమాండ్
Station Tower | సీఎంతో మాట్లాడాలని డిమాండ్
Station Tower | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని చింతలకుంట ప్రాంతంలో ఓ వ్యక్తి రేడియో స్టేషన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేయడం కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడితేనే కిందకు దిగుతానని పట్టుబట్టాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన జాన్ బాబు అనే వ్యక్తి చింతలకుంటలోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే వరకు దిగబోనని భీష్మించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
