YCP MLC | రాజకీయంగా చర్చనీయాంశం..

YCP MLC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో విచారణకు హాజరైన అనంతబాబును కోర్టు వెలుపలే అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ కోసం అనంతబాబు తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అనంతరం అనంతబాబును కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతోంది.
