17 Ships In Que : ఇదిగో గ్రీన్ సాన్వీ Andhra Prabha SPL Story

17 Ships In Que : ఇదిగో గ్రీన్ సాన్వీ Andhra Prabha SPL Story
- అదిగో గ్రీన్ ఆశా
- పక్కనే జగ్ విక్రమ్ రెడీ
- ఇక గ్యాస్ కష్టాలు తీరినట్టే .
- భారత్‌కు ఊరట
- బ్లాక్ మార్కెటీర్లకు కేంద్రం కళ్లెం
- ముడి చమురూ వచ్చేస్తోందోచ్
- క్యూలో 17 భారత నౌకలు
- ఇరాన్‌తో భారత్ మిత్ర దౌత్యం
( ఆంధ్రప్రభ, ముంబై ప్రతినిధి)

అమెరికా ఇజ్రాయెల్ పుణ్యమాని ఆపరేషన్ ఎథిక్ ప్యూరీ తో… ఇండియన్ భా కంపెనీలు, డీలర్ల పేచీతో ఒక వైపు పెట్రోలు ధరల మంటలు.. మరో వైపు గ్యాస్ బండల రేటు పేలుడుతో.. తల్లడిల్లిన భారతీయులకు త్వరలోనే ఊరట లభిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా.. ఇప్పటికే ఆరు ఆయిల్, గ్యాస్ నౌకలు చేరుకున్నాయి. మరో ఎల్పీజీ లోడులో నౌక గ్రీన్ సాన్వీ హోర్ముజ జలసంధిని దాటింది. ఏప్రిల్ 6న భారత్ కు చేరుతుంది. ఇక మిగిలిన 15 నైకలు కూడా రోజు రెండు చొప్పున బయలుదేరుతున్నాయి. ఈ నౌకలన్నీ చేరటానికి మరో 15 రోజులు పడుతుంది. అప్పటి వరకూ.. దేశంలోని బ్లాక్ మార్కెటీర్లను అదుపు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం బిజిబిజీగా మారింది. ఏనీ హౌ.. భారతీయు కుటుంబాల్లో.. చిరువ్యాపారుల్లో గ్యాస్ కష్టాల కథలు కంచి చేరటం ఖాయంగా గకనిపిస్తోంది.
17 Ships In Que : గ్రీన్ సాన్వీ… ఉరుకు పరుగు

హోర్ముజ జలసంధికి వేసిన తాళాలనూ ఇరాన్ తెరుస్తోంది,. తమ శ్రత్రు దేశాలు అమెరికా ఇజ్రాయెల్ తప్పా.. మిగిలిన దేశాలకూ హోర్ముజ జలసంధిని భారత నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని అనుమతించింది. ఇరాన్ అనుమతి తో ఇప్పటి వరకు 6 ఎల్పిజి (LPG) ట్యాంకర్లు భారతదేశానికి చేరుకున్నాయి. ఏడవ నౌక ‘గ్రీన్ సాన్విస శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 3, 2026) హోర్ముజ్ జలసంధిని దాటి భారత జల మార్గంలోకి దూసుకు వస్తోంది. ఇప్పటి కే ముంద్రా పోర్టుకు ఎంటీ శివాలిక్ , కాండ్లా పోర్టుకు ఎంటీ నందాదేవి, జగ్ వసంత్ , న్యూ మంగళూరు పోర్టుకు పైన్ గ్యాస్ , ముంబై పోర్టుకు బీబ్ల్యూ టైర్ చేరరుకోగా .. ఆదివారం ఏప్రిల్ 4 నాటికి ఎన్నూర్ పోర్టుకు బీడబ్ల్యూ ఎల్మ్ చేరుతుంది.
17 Ships In Que : గ్యాస్ బండకు ఊరట

భారత్‌కు ఇప్పటి వరకు 2,80,000 టన్నులు పైగా ఎల్పిజి చేరింది. ఇందులో శివాలిక్ , నందాదేవి నౌకల్లో 92,700 టన్నులు; జగ్ వసంత్ లో 47,612 MT; పైన్ గ్యాస్: 45,000 MT , BW టైర్ , BW ఎల్ లో : 94,000 MT) గ్యాస్ చేరింది. యూఏఈ నుంచి ‘జగ్ లాడ్కీస నౌక సుమారు 80,886 టన్నుల ముడి చమురుతో ముంద్రా పోర్టుకు చేరుకుంది. 46,655 టన్నుల ఎల్సీజీతో ఏప్రిల్ 6, 2026 నాటికి గ్రీన్ సాన్వి ముంబై చేరుకునే అవకాశం ఉంది.
17 Ships In Que : క్యూలో 17 భారత నౌకలు

ఎల్పీజీ లోడుతో గ్రీన్ ఆశా (Green Asha), జగ్ విక్రమ్ (Jag Vikram) రెడీగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో బయలు దేరుతాయి. ఆదేశాల కోసం నావికాదళం ఎదురుచూస్తోంది. 5 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నౌకలు సహా పాటు ఇతర సరుకు రవాణా నౌకలు కూడా ఆర్డర్ల కోసం క్యూలో ఉన్నాయి. ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, మిగిలిన నౌకల సురక్షిత ప్రయాణానికి కృషి చేస్తున్నాయి.
