అంబులెన్స్ లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన జన్ను దీపిక(28)ను ప్రసవం కోసం శుక్రవారం తెల్లవారుజామున 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సిబ్బంది దీపికకు సుఖ ప్రసవం చేశారు. అంబులెన్స్ లోనే దీపిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.అనంతరం తల్లీబిడ్డలను హన్మకొండ జీఏంహెచ్ ఆస్పృత్రిలో చేర్పించారు.నార్మల్ ప్రసవం చేసిన108 సిబ్బంది ఈఎంటి పి నరేష్, పైలెట్ టీ ఓదేలును ఆమె కుటుంబ సభ్యులు అభినందించారు.
