మృతుడి కుటుంబానికి పరామర్శ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఓర్సు చేరాలు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడతు శుక్రవారం మృతి చెందాడు. దీంతో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్ మృతదేహానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్, నాయకులు మేడిపల్లి శ్రీనివాస్ ,నేపాలి రాజేష్, గుండా సురేష్, తదితరులు పాల్గొన్నారు.