పట్టపగలే ఇసుక అక్రమ రవాణా

పట్టపగలే ఇసుక అక్రమ రవాణా

  • ఇసుకా సురుల అక్రమ దందా
  • తువ్వినోనికి తవ్వినంత ఎర్రమట్టి దందా
  • ముడుపులు తీసుకుంటున్న అధికారులు

సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : నారాయణపురం మండల కేంద్రంలోని ఇసుకాసురుల అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందముగా నడుస్తుంది. ఒకవైపు ఎర్రమట్టి అక్రమ రవాణా మరోవైపు ఇసుక అక్రమ దందా జోరుగా నడుస్తుంది. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మండలంలోని మేళ్లచెరువు, దుబ్బల్ల, రాధానగర్ తండా, కడీల బావి తండా,ఎనగండి తండా పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎర్రమట్టి దందా కూడా జోరుగా సాగుతుంది నారాయణపురానికి తలమానికగా ఉన్న ఎర్రమన్ను గుట్ట రూపు రేఖలు అక్రమార్కులు మార్చేస్తున్నారు. ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడే జెసిపి యజమానులు కమిటీలు ఏర్పాటు చేసుకొని సంబంధిత అధికారులకు ముడుపులు అప్పజెప్పి ఏదేచ్ఛగా దందా నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Leave a Reply