డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చింతల శ్రీనివాస్

చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా చెన్నూరు పట్టణానికి చెందిన చింతల శ్రీనివాస్ నియమితులైరు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన డిసిసి ఎంపిక కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా శ్రీనివాస్ నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావత్, మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply