కాంగ్రెస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం
తొర్రూరు, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ ఝాన్సీ రెడ్డిలు అన్నారు.పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కేంద్రానికి చెందిన జమా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని, టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి
శాలువాలు కప్పి, బొకేలు అందించి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని తెలుపుతూ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల అభివృద్ధి కోసం విద్యా, వైద్య, ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించి ముస్లింల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కృషి చేశారని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జమా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ అలీమ్, ఉపాధ్యక్షులు మహమ్మద్ మౌలానా పాషా,మహ్మద్ షబ్బీర్ అలీ,ప్రధాన కార్యదర్శి మహ్మద్ అమీర్, కోశాధికారి మహమ్మద్ గౌస్ మైనోద్దీన్, సహాయ కార్యదర్శులు మమ్మద్ యాకుబ్ పాషా,ఎస్డి చాంద్ పాషా, మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ మెంబర్ మహమ్మద్ జలీల్,కమిటీ సభ్యులు మహమ్మద్ సలాం పాషా, మహమ్మద్ అమీనుల్ ఇస్లాం, ముస్లిం మత పెద్దలు మహమ్మద్ నదీమ్, మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
