భద్రకాళి ఆలయం వద్ద ప్లకార్డుతో నిరసన..

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : భద్రకాళి అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వ్యక్తి ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాడు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా ఆధ్యాత్మికత, భక్తి, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ సందేశం ఇచ్చాడు.

“దేవాలయ పవిత్రతను కాపాడుదాం” అనే ప్లకార్డును ప్రదర్శించిన ఆయన, ఆలయాలను రాజకీయ పార్టీలు, వ్యక్తిగత ప్రచారాలకు వేదికగా ఉపయోగించవద్దని సూచించారు.

భద్రకాళి అమ్మవారి సన్నిధిలో భక్తి భావంతో మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని, పవిత్రతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.