పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

  • మదర్ డెయిరీని ఆదుకుంటాం
  • సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి ; వ్యవసాయం, పాడి పరిశ్రమ రైతుకు రెండు కళ్ళలాంటివని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ తమ నివాసం లో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ చైర్మన్ జయతీర్థాచారి మర్యాదపూర్వకం గా కలిసారు.

మదర్ డెయిరీ (నార్ముల్ ) గత కొద్ది నెలలుగా అప్పుల ఊభి కొట్టు మిట్టాడుతుండగా పాడి రైతులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భువ‌న‌గిరి ఎంపి చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ బీర్ల అయిల‌య్య‌ లు సిఎం కు వివరింపగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ చైర్మన్ జయతీర్థాచారితో మాట్లాడారు.

మదర్ డెయిరీ ఇబ్బందులను తీర్చి అభివృద్ధి బాటలోకి తీసుకొని రావాలని తెలిపారు.రాష్ట్రంలో పాడి ప‌రిశ్రమాభివృద్ధి పై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి , మదర్‌ డెయిరీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సంధిల భాస్కర్ గౌడ్ తదితరులున్నారు.