ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి….

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అనీ కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కొత్తబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని చెప్పారు.
లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉప సర్పంచ్ దశరథం, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సింగరావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, మాజీ ఎంపీపీలు గాల్ రెడ్డి, సుదర్శన్, గ్రామ సచివాలయ వార్డు సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
