భీంగల్ ఊర పండుగకు రూ. లక్ష విరాళం..

ఈరవత్రి అనిల్ కుమార్ ఔదార్యం

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణంలో త్వరలో నిర్వహించనున్న సాంప్రదాయ ఊర పండుగ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ రూ.1 లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఊర పండుగను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజలు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని ఈరవత్రి అనిల్ కుమార్ కోరారు. భీంగల్ ప్రజల ఐక్యతకు, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈరవత్రి అనిల్ కుమార్ అందించిన రూ. లక్ష విరాళం పండుగ ఏర్పాట్లకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, సర్వ సమాజ్ అధ్యక్షులు పతాని కృష్ణ, జేజే నర్సయ్య, రఘు, బ్రహ్మం, సురేష్, శెవ్వ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.