అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సింహాద్రి రమేష్ బాబు..

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సింహాద్రి రమేష్ బాబు..
కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారిని అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు – కెప్టెన్ లక్ష్మీ దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజాలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా నాయకులు కొండవీటి వెంకట నారాయణరావు, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కొండవీటి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మత్తి సూరిబాబు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు బెజవాడ రవి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తండు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొండవీడు పూర్ణచంద్రరావు, పులిగడ్డ ఏసు, కొండవీటి శ్రీను, కొండవీటి రాము, కోలా నాగరాజు, విశ్వనాథపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, అమ్మవారి భక్తులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
