ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారు..

ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారు..
36వవార్డులో…. ఆత్మీయ పలకరింపులతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
మంచివాడు మా రాము అంటూ… ఎమ్మెల్యేతో ఫోటోలు దిగిన వృద్ధులు
గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
గుడివాడ పట్టణం 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంచివాడు మా రాము అంటూ… ఎమ్మెల్యేతో పలువురు వృద్ధులు తమ సెల్ ఫోనుల ద్వారా ఫోటోలు దిగారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు….సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా, వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు.గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ…. అనేక మంచి పనులు చేస్తుందన్నారు.
కార్యాలయాల్లో కూర్చొని చట్టాలు చేయడం కాదు…. ప్రజల మధ్య ఉంటూ….ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు.
గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టిడిపి నాయకులు పండ్రాజు సాంబశివరావు, లోయ శివాజీ, బ్రహ్మయ్య, గొర్ల శ్రీలక్ష్మి,గోరిపర్తి ప్రసాద్, సతీష్,లోయ విజయ్, జోగా బాలకృష్ణ, వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి,సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

