ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు

ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు
ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి ఆకస్మికంగా ఈదురు గాలులతో పాటు కురిసిన తేలికపాటి వర్షానికి పంట పొలాలలో వరి పంట నేలకొరిగింది. వరి కోతలు సమీపిస్తున్న తరుణంలో ఈదురు గాలులతో తమ వరి పంటలకు నష్టం వాటిల్లడం బాధాకరమైన విషయం అని అన్నారు. ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పెద్ద మొత్తం లో నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని రైతులు పేర్కొంటున్నారు.
